: భార్య నుంచి డబ్బు కోసం 'వాట్సాప్ కిడ్నాప్'... కలకలం రేపిన కేసును ఛేదించిన పోలీసులు


అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసు కలకలం సృష్టించగా, పోలీసులు దాన్నో డ్రామాగా తేల్చి పారేశారు. వ్యాపారి రామాంజనేయులుని కిడ్నాప్ చేశామని వాట్స్ యాప్ లో ఓ వీడియో రాగా, అందులో రామాంజనేయులు నోటికి గుడ్డలు కుక్కి, రెండు కొండల మధ్య బందీగా ఉన్నట్టు చూపించడంతో, అతని భార్య, తండ్రి తీవ్ర ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ వీడియోకు ప్రసార మాధ్యమాల్లో అమిత ప్రచారం లభించడంతో, పోలీసులు కూడా సీరియస్ గా తీసుకుని విచారణ ప్రారంభించారు. రామాంజనేయులు ఫోన్ ట్రాప్ చేయగా, అతను బెంగళూరు సమీపంలో ఉన్నట్టు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి, భార్య నుంచి డబ్బు కోసమే తనకు తాను కిడ్నాప్ అయినట్టు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News