: కర్నూలులో మరో హైటెన్షన్!... గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు గండి, భయాందోళనలో పలు గ్రామాలు


కర్నూలు జిల్లాలో కొద్దిసేపటి క్రితం మరో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని ఎమ్మిగనూరు పరిసరాల్లోని గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఉన్న జలాశయానికి భారీ గండి పడింది. దీంతో జలాశయం నుంచి భారీగా నీరు లీకవుతోంది. గండిని సకాలంలో గుర్తించిన సమీప గ్రామాల రైతులు దానిని పూడ్చివేసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని గండి పూడ్చివేతపై సమాలోచనలు చేస్తున్నారు. క్షణక్షణానికి లీకవుతున్న నీటి శాతం పెరుగుతున్న క్రమంలో ఏ క్షణాన్నైనా జలాశయం కట్టలు తెగిపోయే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే... సమీపంలోని గ్రామాలన్నీ నీట మునగడం ఖాయమే. దీంతో ముందు జాగ్రత్త చర్యల కింద సమీప గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భారీ జలాశయానికి గండి పడిందన్న వార్త అక్కడి పరిసర గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

  • Loading...

More Telugu News