: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... రూ. 50 వేల విత్ డ్రాకు టీడీఎస్ రద్దు
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. రేపటి నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా నుంచి రూ. 50 వేల వరకు విత్ డ్రా చేసుకుంటే దానిపై ఎలాంటి టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) ఉండదు. ప్రస్తుతం రూ. 30 వేలకు పైగా విత్ డ్రా చేసుకుంటే టీడీఎస్ చెల్లించాల్సి వుండగా, దాన్ని రూ. 50 వేలకు పెంచుతున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉద్యోగులు ముందుగానే పీఎఫ్ లో డబ్బు వెనక్కు తీసుకుంటున్న సందర్భాలు పెరుగుతూ ఉండటంతో, పదవీ విరమణ తరువాత ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతాయన్న ఉద్దేశంతో, పీఎఫ్ విత్ డ్రాలను తగ్గించేందుకు పన్నులు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో కేంద్రం తన తాజా నిర్ణయాన్ని నోటిఫై చేసింది.