: భువనేశ్వర్‌లో ఇక ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ విధానం
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వచ్చేనెల 15నుంచి ద్విచక్ర వాహనాలు వినియోగించే వారు హెల్మెట్ లేకుండా బంక్‌లకి వెళ్లి పెట్రోల్‌ను పొందాలనుకుంటే.. అక్కడి సిబ్బంది వారికి ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ అనే సమాధానాన్ని చెప్పనున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ వాడకాన్ని తప్పని సరిచేసే ప్రయత్నంలో భాగంగా అక్కడి పోలీసులు ఈ చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ విధానాన్ని అమలు చేయనున్నట్లు వాహనదారులకు, పెట్రోల్ బంక్‌లకు తాజాగా ప్రభుత్వాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనాలు అమ్మేటప్పుడే వాటితో పాటుగా హెల్మెట్‌లను కూడా తప్పనిసరిగా అమ్మాలని అక్కడి కంపెనీలను కూడా కోరామని పోలీసులు తెలిపారు.