: పోలీసు వలయాన్ని బద్దలుకొట్టిన కర్నూలు రైతులు!... సిధ్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన!
కర్నూలు జిల్లా రైతులు పోలీసుల వలయాన్ని బద్దలు కొట్టారు. రాయలసీమ సాగునీటి వెతలకు చెక్ పెట్టనుందని భావిస్తున్న సిద్ధేశ్వరం అలుగుకు వారు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రాయలసీమ జలసాధన సమితి నేత దశరథరామిరెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ తమను నిలువరించినా, వెల్లువలా తరలివచ్చిన రైతు సోదరుల సహాయంతో అనుకున్న లక్ష్యం మేరకు సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేశామని ఆయన ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన రైతులను అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు. ప్రభావం చూపే నేతలను అదుపులోకి తీసుకోవడంతో పాటు హౌజ్ అరెస్ట్ చేసినా, అలుగుకు రైతులు శంకుస్థాపన చేసేశారు.