: చిత్తూరు కి'లేడీ' పావని అరెస్ట్
పేదలు, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను అలుసుగా తీసుకుని అధిక వడ్డీలకు అప్పులిస్తూ, ఆపై వారిని రౌడీలతో బెదిరిస్తున్న ఆరోపణలపై చిత్తూరుకు చెందిన కిలాడీ పావనిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాకీలను సమయానికి తీర్చని వారిపై పావని, మేయర్ హత్య కేసు నిందితుడు చింటూను ప్రయోగించేదని పోలీసులు తెలిపారు. చింటూ తన అనుచరులతో వెళ్లి బెదరింపులకు పాల్పడేవాడని, ఆపై బాధితుల నుంచి బంగారం, ఆస్తులను పావని బలవంతంగా తీసుకునేదని పేర్కొన్నారు. పావనిపై ఎన్నో ఫిర్యాదులు రాగా, ఆమె తప్పించుకు తిరుగుతోందని, సేలంలో ఉన్నట్టు పక్కా సమాచారాన్ని అందుకుని, దాడులు జరిపి ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పావని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని కోరారు.