: పరిటాల వర్గీయులు నన్ను చంపాలని చూస్తున్నారు.. నాపై దాడిచేశారు: వైసీపీ నేత తీవ్ర ఆరోపణలు


అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఇంఛార్జ్ తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి పరిటాల కుటుంబంపై పలు ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను ప‌రిటాల వ‌ర్గీయులు చంపాల‌ని చూస్తున్నార‌ని, నిన్న త‌న‌పై వారు దాడి చేశార‌ని మీడియాకు తెలిపారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మంత్రి పరిటాల సునీతతో పాటు ఆమె కుటుంబం నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని అన్నారు. త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి సెక్యూరిటీ కూడా లేద‌ని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌న‌పై అసూయ‌, ద్వేషంతో ఉన్నార‌ని అన్నారు. త‌మ‌పై టీడీపీ నేత‌లు ప‌లుసార్లు దాడికి దిగార‌ని ప్రకాశ్రెడ్డితో పాటు ప‌లువురు వైసీపీ నేత‌లు ఆరోపించారు.

  • Loading...

More Telugu News