: లోకేష్ సహా అందరూ సహకరించారు: టీజీ వెంకటేష్ హర్షం
చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ టికెట్ దక్కించుకున్న టీజీ వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలందరి సహకారంతోనే తనకు సీటు వచ్చిందని ఆయన అన్నారు. టీడీపీ యువనేత లోకేష్ కూడా మంచి సహకారాన్నందించారని ప్రత్యేకంగా చెప్పారు. టీడీపీ మంచి విధానాలతో పాలన అందిస్తోందని ఆయన అన్నారు. పార్టీ పట్ల విధేయత చూపెడుతూ రాష్ట్రాభివృద్ధిలో తన సహకారం అందిస్తానన్నారు. వెనకబడిన కులాలకు, దళితుల సంక్షేమానికి తెలుగు దేశం పార్టీ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. టీడీపీ అనుసరిస్తోన్న విధానాలు మంచి ఫలితాలనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.