: నెహ్రూను పొగడుతూ, మోదీని విమర్శించినందుకు కలెక్టరుకు తాఖీదులు


మాజీ ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూను పొగడుతూ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించినందుకు మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఓ కలెక్టరుపై కక్షకట్టింది. బర్వానీలో కలెక్టరుగా పనిచేస్తున్న అజయ్ గంగ్వార్ సింగ్, తన ఫేస్ బుక్ ఖాతాలో మోదీకి వ్యతిరేకంగా కామెంట్లను పెట్టినందుకు, వెంటనే వివరణ ఇవ్వాలంటూ వారం రోజుల గడువిచ్చిన ప్రభుత్వం వారం పూర్తి కాకుండానే బదిలీ వేటు వేసింది. కలెక్టరు బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించి, సెక్రటేరియట్ లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ మండిపడుతూ, బీజేపీ సర్కారు భావ ప్రకటనా హక్కును కూడా హరిస్తోందని, తక్షణం గంగ్వార్ ను తిరిగి కలెక్టరుగా నియమించాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News