: మేమున్నాం... ఆందోళన వద్దు!: విఠల్ రావు కుమారుడికి రాహుల్ గాంధీ ఫోన్!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ విఠల్ రావు మూడు రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. విఠల్ రావు మృతిపై కాస్తంత ఆలస్యంగా సమాచారం అందుకున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న విఠల్ రావు కుమారుడు శ్రీధర్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా విఠల్ రావు మృతికి సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పార్టీకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన విఠల్ రావు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన శ్రీధర్ కు భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News