: మహిళ కారులో బీరు సీసాలు, గంజాయి ప్యాకెట్లు!... యాక్సిడెంట్ తో వెలుగులోకి!
ఆధునిక కాలంలో కొందరు మహిళలు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ హైదరాబాదులో పలు ఘటనల్లో మహిళలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఘటనలు కోకొల్లలు. తాజాగా హైదరాబాదులోని హబ్సీగూడకు చెందిన శిరీష పద్మ అనే మహిళ తన కారులో బీరు సీసాలు, గంజాయి ప్యాకెట్లు సర్దుకుని బెంగళూరుకు బయలుదేరింది. అయితే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వద్దకు చేరుకోగానే ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన శిరీషను అక్కడి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె కారును పరిశీలించిన పోలీసులు... అందులో బీరు బాటిళ్లతో పాటు గంజాయి ప్యాకెట్లు చూసి కంగుతిన్నారు. బీరుతో పాటు గంజాయి సేవనంతో మత్తులో కూరుకుపోయిన శిరీష తన కారుపై కంట్రోల్ కోల్పోయిందని, ఆ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని వారు తేల్చారు.