: నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్


నేడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోనున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బ్రిటన్ లోని ఓ ఆసుపత్రిలో ఉన్న ఆయన నుంచి సోమవారం నాడు ప్రధానికి కాల్ వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. సర్జరీకి వెళ్లే ముందు షరీఫ్ ఈ ఫోన్ చేశారని, శస్త్రచికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని ప్రధాని కోరారని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. కాగా, గత శనివారం నాడు నరేంద్ర మోదీ, షరీఫ్ శస్త్రచికిత్సను ప్రస్తావిస్తూ, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన నేపథ్యంలో, సర్జరీకి ముందు షరీఫ్ స్వయంగా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం, షరీఫ్ ఓ వారం రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News