: ధోనీ నుంచి లాగేసుకోవడం కాదు కానీ... నేనైతే మూడు ఫార్మాట్లూ కోహ్లీకే ఇస్తాను: రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు ఆడే టెస్టులతో పాటు వన్డేలు, టీ-20 పోటీల్లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చే సమయం ఆసన్నమైందని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ధోనీ నుంచి లాగేసుకోవడం ఏమీ లేదని ఆయన అన్నారు. తాను సెలక్షన్ కమిటీకి చైర్మన్ అయివుంటే కోహ్లీకి మూడు ఫార్మాట్లలోనూ జట్టును ముందుకు తీసుకువెళ్లే బాధ్యతలు ఇస్తానని తెలిపాడు. జట్టులో ఆటగాడిగా ధోనీ ఎల్లప్పుడూ తన విలువైన సలహా, సూచనలతో సేవలు అందించవచ్చని, మానసికంగా ఇప్పుడు కోహ్లీ ఎంతో బలంగా ఉన్నాడని తెలిపాడు.