: సత్య నాదెళ్ల నోట... గాలిబ్ కవితా పంక్తుల వెల్లువ!


తెలుగు తేజం సత్య నాదెళ్ల... ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు అధిపతి. సాఫ్ట్ వేర్ కంపెనీకి అధినేతగా ఉన్న ఆయన నోట ఎప్పుడూ సాంకేతికతకు సంబంధించిన సంగతులే వినిపిస్తాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎంత సాఫ్ట్ వేర్ దిగ్గజం అయినా.. ఆయనకూ ఓ కళా పిపాస ఉంటుందిగా. అదేంటో ఆయనే నిన్న స్వయంగా తెలియజేశారు. కవితలంటే తనకు ఎంతిష్టమో ఆయన తన ఢిల్లీ పర్యటనలో వెల్లడించారు. నిన్న ఢిల్లీలో జరిగిన డెవలపర్లతో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల నోటి వెంట... 19వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ పార్శీ, ఉర్దూ కవి మీర్జా గాలిబ్ కవితా పంక్తులు వెల్లువలా వినిపించాయి. ‘‘హజారో క్వాయిషే అయిసీ, కే హర్ ఖాయిస్ పే దమ్ నిక్లే, బహుత్ నిక్లే మేరే ఆర్మాన్, ఫిర్ బీ కమ్ నిక్లే (వేల కాంక్షలున్నాయి. ప్రతి కాంక్ష ప్రాణమిచ్చేంతటిదే. ఎన్నో కాంక్షలు నెరవేరాయి. అయినా ఇంకా ఎన్నో కాంక్షలున్నాయి)’’ అన్న గాలిబ్ పంక్తులను సత్య నాదెళ్ల వల్లె వేశారు.

  • Loading...

More Telugu News