: ‘విప్రో’ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు!
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచనుంది. ఈ విషయాన్ని విప్రో ఒక ప్రకటన ద్వారా తెలిపింది. దేశంలో పని చేస్తున్న విప్రో ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతన పెంపును జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తేనున్నట్లు పేర్కొంది. అంతేకాక, అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన వారికి అదనపు మొత్తాలను కూడా ఇచ్చినట్లు తెలిపింది. తమ కంపెనీలో ఆఫ్ షోర్ ఉద్యోగులు వేతనంలో సుమారు 9.5 శాతం పెంపును పొందనున్నారని, ఆన్ సైట్ ఉద్యోగులకు కనీసం రెండు శాతం వరకూ పెంపు ఉంటుందని వివరించింది. అదేవిధంగా, పనిలో నైపుణ్యం, ప్రత్యేకత కనబర్చిన వారికి ప్రత్యేకంగా హైక్ ఇవ్వనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.