: జూనియర్ డాక్టర్ తో అసభ్యంగా ప్రవర్తించిన డ్యూటీ రూం ఇంచార్జి


తనపై రూం ఇంచార్జి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఒక జూనియర్ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 19న పేషెంట్స్ ను చూసిన అనంతరం డ్యూటీ ఆఫీస్ లో ఆమె విశ్రాంతి తీసుకుంటోంది. ఈలోగా డ్యూటీ రూం ఇంచార్జి కుమార్ టీ తీసుకుని లోపలికి వచ్చి ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. వెంటనే, బయటకు వచ్చేసిన సదరు డాక్టరు తన సహోద్యోగులకు విషయాన్ని చెప్పింది. దీంతో, కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ మాట్లాడుతూ, ఈ సంఘటనపై విచారణకు తాము ఒక కమిటీని నియమించామని చెప్పారు. నిందితుడు కుమార్ ను సస్పెండ్ చేశామన్నారు.

  • Loading...

More Telugu News