: రెండు రోజుల పాటు సంజీవయ్య పార్కు మూసివేత


రేపు, ఎల్లుండి హైదరాబాదులోని సంజీవయ్య పార్కును మూసివేయాలని హెచ్ఎండీఏ (హైదరాబాదు మున్సిపల్ డెవలెప్ మెంట్ అధారిటీ) నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని అతిపెద్ద పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ నేపధ్యంలో సంజీవయ్య పార్కును రెండు రోజులపాటు మూసేయాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుపాటు సందర్శకులను, పాదచారులను పార్కులోకి అనుమతించమని అధికారులు తెలిపారు. కాగా, ప్రతిరోజూ తెల్లవారు జామున సంజీవయ్య పార్కులో వాహ్యాళికి పాదచారులు క్యూకడతారు. దీంతో వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News