: ఈ రోజు ప్రైవేటు బిల్లుకు మద్దతు అడుగుతున్నారు... ఆ రోజేం చేశారు?: చంద్రబాబు ప్రశ్న
'ఈ రోజు కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రైవేటు బిల్లు వస్తుంది, టీడీపీ మద్దతు తెలపాలని అడుగుతున్నారు? మరి ఆ రోజు ఏం చేశారు?' అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పెద్దలు వార్ రూంలో సమావేశమైనప్పుడు, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామని నిర్ణయించినప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా అవసరమన్న సంగతి తెలియలేదా? అని నిలదీశారు. ఇప్పుడు ఈ నాటకాలు ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి చేయాల్సిన నష్టం అంతా చేసేసి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, ఎవరిని ముంచడానికని ఆయన అడిగారు.