: 2050 వరకు ఏపీలో టీడీపీయే అధికారంలో ఉండాలి: చంద్రబాబు


రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నుంచి రాజ్యసభకు ఇద్దరికి అవకాశం ఇచ్చామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సుజనా చౌదరిని మరోసారి రాజ్యసభకు పంపిస్తున్నామని ఆయన చెప్పారు. కర్నూలుకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ తరపున టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సభ్యత్వం కల్పించామని అన్నారు. ఇక బీజేపీ తమను ఒక సీటు కేటాయించమని అడిగిందని, అందుకే రాష్ట్ర ప్రయోజనాలను గుర్తుంచుకుని కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. కేంద్రం చేసిన సాయం చాలదని, ఇంకా సాయం కావాలని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానమైన స్థాయి సంపాదించుకునేంత వరకు ఏపీకి సాయం చేయాలని ఆయన అన్నారు. 2050 వరకు ఏపీలో టీడీపీనే గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News