: కేసుల్లోని రెండో ముద్దాయిని రాజ్యసభకు పంపిస్తారా?: వైసీపీకి చంద్రబాబు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ లో ఏ1, ఏ2 అభ్యర్థులు తప్ప ఇంకెవరూ లేరా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 11 కేసుల్లో ముద్దాయి అయిన వైఎస్సార్సీపీ అధినేత, అలాంటి కేసుల్లో 'ఏ2'ని (విజయసాయి రెడ్డిని) రాజ్యసభకు పంపిస్తారా? మన రాష్ట్రం ఎక్కడికి పోతోందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో నేతలు లేరా? వారికి రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వారిని రాజ్యసభకు పంపి దేశానికి ఏపీ మీద ఎలాంటి సందేశం ఇస్తున్నామని ఆయన అడిగారు. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని అంటారా? అని ఆయన ప్రశ్నించారు. నాలుగో అభ్యర్థిపై పార్టీలో చేరిన అభ్యర్థులే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. రేపు జరగబోయేదానికి ఇప్పుడే నిర్ణయం ఏం చెబుతామని ఆయన నవ్వుతూ అన్నారు.