: కాసేపట్లో హైదరాబాదుకు సురేష్ ప్రభు, రేపు ఉదయం నామినేషన్
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీచేయనున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కాసేపట్లో హైదరాబాదు చేరుకోనున్నారు. ఆయనకు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలుకనున్నారు. రేపు ఉదయం ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, మిత్రధర్మంలో భాగంగా టీడీపీ ఒక సీటును బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. మరోపక్క టీడీపీ నుంచి టీజీ వెంకటేష్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా రాజ్యసభకు పోటీ చేయడానికి ఎంపికైన సంగతి తెలిసిందే.