: ‘కబడ్డీ..కబడ్డీ’ అంటూ కూత పెట్టిన మధుసూదనాచారి, స్వామిగౌడ్


తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో క్రీడాకారులతో కలిసి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి కబడ్డీ ఆడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ స్పోర్ట్స్ మీట్ ను స్వామిగౌడ్, మధుసూదనాచారి, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి కబడ్డీ ఆడటంతో అక్కడున్నవాళ్లు ఆసక్తిగా తిలకించారు. మహిళా ఉద్యోగులకు కుర్చీ ఆటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News