: చెక్కభజన చేస్తోంది ముద్రగడే!: ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
ఏపీ మంత్రులు చెక్క భజన చేస్తున్నారంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన నాయకుల వద్దకు వెళ్లి ముద్రగడ పద్మనాభమే చెక్కభజన చేస్తున్నారని విమర్శించారు. 1994లో కాపులకు చంద్రబాబు అన్యాయం చేశారంటున్న ముద్రగడ, 1999లో టీడీపీ ఎంపీగా ఆయన ఎలా గెలిచారని చినరాజప్ప ప్రశ్నించారు. కాపు యువతను ముద్రగడ రెచ్చగొడుతున్నారని, ఆయన విషయంలో పార్టీ నేతలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.