: తప్పుడు ట్వీట్ చేసి, నాలిక్కరుచుకున్న పాక్ క్రికెటర్


ఇండిన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాదు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను అభినందిస్తూ ట్వీట్ చేసిన పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ తీవ్ర విమర్శలపాలయ్యాడు. 'ఐపీఎల్ 2016 టైటిల్ గెలిచిన వార్నర్ కు శుభాకాంక్షలు, ఆ జట్టు ఈ విజయానికి అర్హమైంది' అని ట్వీట్ చేయబోయిన పాకిస్థాన్ వికెట్ కీపర్ ఉమర్ అక్మల్... 'పీఎస్ఎల్ (పాకిస్థాన్ క్రికెట్ లీగ్) 2016 టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్ కు శుభాకాంక్షలు, ఆ జట్టు ఈ విజయానికి అర్హమైనది' అని ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ పేర్కొంటున్నట్టు పాక్ ఆటగాళ్లకు చదువు రాదని, వార్నర్ పీఎస్ఎల్ లో ఆడడం లేదని అంటూ పలు విమర్శలు గుప్పించారు. దీంతో నాలిక్కరుచుకున్న ఉమర్ అక్మల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేసి, మళ్లీ ఫ్రెష్ గా వార్నర్ ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News