: రాజ్యసభకు సుజనా, టీజీ, సురేష్ ప్రభు అభ్యర్థిత్వాలు ఖరారు
తమ తరఫున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. ఏపీ నుంచి టీడీపీకి ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభకు పంపుకునే బలముండగా, ఒక సీటును మిత్రపక్షం బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. మిగిలిన వాటిలో ఒకటి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన టీజీ వెంకటేష్ కు, మరొకటి కేంద్రమంత్రి సుజనా చౌదరికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బీజేపీకి కేటాయించిన స్థానం నుంచి కేంద్ర మంత్రి సురేష్ ప్రభును రాజ్యసభకు పంపుతున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ట్వీట్ ద్వారా తెలిపారు.