: ముగింపు సభలో ప్రసంగించేందుకు 17 మంది ఎంపిక


ఈ రోజు సాయంత్రం విశాఖలో చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు భారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు విశాఖకు తరలివచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. సాయంత్రం ముగింపు సభలో ప్రసంగించేందుకు వాగ్దాటి కలిగిన 17 మంది నేతలను చంద్రబాబు ఎంపిక చేశారని సమాచారం. తాను వేదిక ఎక్కే లోపు ప్రసంగాలను పూర్తి చేయాలని ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్పాయి. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అగనంపూడి టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఈ పైలాన్ ను టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, దేవినేని ఉమా, సుజనా చౌదరి తదితరులు పరిశీలించారు.

  • Loading...

More Telugu News