: ప్రతి ఒక్కరికీ హద్దులుంటాయి: శ్రద్ధా కపూర్


రచయిత, దర్శకుడు, నటుడు ఫర్హాన్ అఖ్తర్.. భార్య అధూనా భంభానీతో విడిపోయిన తరువాత పలువురితో డేటింగ్ చేస్తున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. 'వాజిర్' సినిమాలో ఫర్హాన్ తో నటించిన అదితిరావ్ హైదరితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ కధనాలు పేర్కొంటుండగా, మరోవైపు 'రాక్ స్టార్ 2' సహనటి శ్రద్ధా కపూర్ తో కూడా ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై శ్రద్ధా కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా ప్రచారం అవుతున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ హద్దులుంటాయని, అలాగే మీడియాకి కూడా హద్దులు ఉన్నాయని చెప్పింది. మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవద్దని సూచించింది. ప్రతి ఒక్కరి మనోభావాలు గౌరవించాలని శ్రద్ధా సూచించింది.

  • Loading...

More Telugu News