: చంద్రబాబు మాకు డబ్బులివ్వలేదు... నేనే చంద్రబాబుకి లక్ష ఇచ్చాను: జలీల్ ఖాన్


వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చామన్న కారణంతో తమపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత జలీల్ ఖాన్ విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, టీడీపీలో చేరినందుకు చంద్రబాబునాయుడు తమకు 30 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చారని ఆరోపిస్తున్నారని అన్నారు. నిజానికి చంద్రబాబు తమకు 30 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. తిరిగి తానే చంద్రబాబుకు లక్ష రూపాయలు పార్టీ ఫండ్ గా ఇచ్చానని ఆయన చెప్పారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు పడుతున్న కష్టం చూసి, లక్షరూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News