: ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన పోస్టర్!
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం అభిమానుల అంచనాలను తల్లకిందులు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే నెటిజన్లు పలు రకాల విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మోత్సవం’కు సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో కనపడుతోంది. ఈ పోస్టర్ ప్రిన్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించేలా ఉంది. ఇంతకీ, ఈ పోస్టర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసింది. నిడివి ఎక్కువైనందున ఆ సినిమాలోని కొన్ని సీన్లు తీసేసి చిత్రాన్ని ట్రిమ్ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టర్ వేశారు. 'బోర్ సీన్స్ తీసినందువల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం’ అంటూ రాసి ఉన్న ఆ పోస్టర్ పై మహేష్ బాబు నవ్వుతూ ఉన్న ఫోటో వుంది. ఇదే ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోందట.