: విజయసాయి రెడ్డికి ఓటేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు: జలీల్ ఖాన్
విజయసాయిరెడ్డికి ఓటేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని టీడీపీ నేత జలీల్ ఖాన్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, విజయసాయి రెడ్డికి ఓటేసేందుకు సిద్ధంగా లేని ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. అందుకే తాము నాలుగో అభ్యర్థిని నిలబెడుతున్నామని ఆయన చెప్పారు. అందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల అభీష్టానికి వ్యతిరేకంగా తనకు నచ్చిన వ్యక్తిని ప్రజాజీవితంలోకి పంపుతానని చెబితే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల హక్కులను వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాలరాస్తూ, వారిని అవమానపరుస్తున్నారని ఆయన తెలిపారు.