: సచిన్ బేబీ, డివిలియర్స్ ఓటమిని తట్టుకోలేకపోయారు!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చివర్లో భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ చేరుతుందని ఏ దశలోనూ అనిపించలేదు. వరుస పరాజయాలతో చతికిలబడ్డ బెంగళూరు జట్టు బ్యాట్స్ మన్ రాణించడంతో ఫైనల్స్ లో ప్రవేశించింది. ఫైనల్లో 18వ ఓవర్ వరుకు బెంగళూరుదే పైచేయి. 18వ ఓవర్ లో భువనేశ్వర్ మ్యాచ్ ను తారుమారు చేశాడు. రాయల్స్ కి 12 పరుగులు కావాల్సిన దశలో సింగిల్స్ ఇస్తూ ఆకట్టుకున్నాడు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. ముస్తాఫిజుర్ ఓవర్ లో పరుగులకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో క్రీజులో ఉన్న సచిన్ బేబీకి జట్టు ఓటమి తెలిసిపోయింది. దీంతో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు, క్రీజులోనే ఏడ్చేశాడు. అతను ఊహించినట్టే జట్టు ఓటమిపాలైంది. బెంగళూరు ఆటగాళ్లలో మునుపటి ఉత్సాహం లేదు. కోహ్లీ స్పోర్టివ్ స్పిరిట్ తో అందర్నీ అభినందించినా, డివిలియర్స్ కళ్లలో నీళ్లు తిరిగాయి. పలు సందర్భాల్లో వేదికపైకి వచ్చిన డివిలియర్స్ కదిపితే ఏడ్చేలా కనిపించాడు. ఓటమి ఒత్తిడిని తట్టుకునేందుకు బాగా గాలిపీల్చి వదిలినా ఓటమి భారం పోయినట్టు కనపడలేదు. ఇక షేన్ వాట్సన్ అయితే కళ్ల నిండా నీళ్లతో కనిపించాడు. సున్నిత మనస్కుడైన వాట్సన్ తొందరగా స్పందిస్తాడని సహచరులు చెబుతారు. అలాంటి వాట్సన్ వేసిన చివరి ఓవర్ పరుగులే బెంగళూరు జట్టుకు భారంగా పరిణమించాయి. ఆ ఒక్క ఓవర్ ద్వారా పరుగులు లభించకుండా ఉండి ఉంటే, విజేత బెంగళూరు జట్టే అనడంలో అతిశయోక్తి లేదు. ఎంత స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించినా ఓటమి భారం ఆటగాళ్లను ఆవేదనకు గురిచేసింది.