: యూపీకి బీజేపీ సీఎం అభ్యర్థిగా స్మృతీ ఇరానీ?


వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ లో స్థానిక పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీసి పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్మృతీ ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్, బయటి రాష్ట్రాలకు చెందిన వారు వద్దని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రజాదరణగల మహిళా నేతగా స్మృతి ప్రత్యర్థులకు గట్టి సవాళ్లను విసరగలదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, యూపీలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం ఏ పార్టీకైనా సవాలేనన్న సంగతి అందరికీ తెలిసిందే. బ్రాహ్మణులను ఎంపిక చేస్తే, ఠాకూర్లకు కోపం. ఠాకూర్లను ఎంపిక చేస్తే యాదవులకు కోపం. దళితులను ఎంపిక చేస్తే, అగ్రవర్ణాలకు దూరం... ఇలా సాగుతుంటాయి అక్కడి రాజకీయాలు. ఇక ఆర్ఎస్ఎస్ కాదంటున్నంత మాత్రాన స్మృతీ అభ్యర్థిత్వంపై వెనుకంజ వేసినట్టు కాదని బీజేపీ అధికార వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా, యూపీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం లభించకపోవచ్చు.

  • Loading...

More Telugu News