: టీమిండియాకు త్వరలో కొత్త కోచ్: బీసీసీఐ అధ్యక్షుడు
టీమిండియాకు త్వరలో కొత్త కోచ్ వస్తారని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏసీఏ ఇండోర్ స్టేడియాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం యువ క్రీడాకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వర్ధమాన క్రికెటర్లను తయారు చేయడంలో ఏసీఏ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇక టీమిండియా కోచ్ కు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, జూన్ లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఏసీఏ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా ఔత్సాహిక క్రీడాకారులు పలువురు పాల్గొన్నారు.