: గుంటూరులో పిచ్చికుక్కల స్వైర విహారం.. 15మంది చిన్నారులపై దాడి
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. అక్కడి రాజన్న పాలెం, సుబ్బయ్య పాలెం గ్రామాల్లో ఏకంగా 15మంది చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుక్కల దాడిలో గాయపడ్డ వారందరూ అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్కలు ఈరోజు ఏకంగా 20మందిపై దాడికి దిగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద అక్కడి ప్రాంతాల్లో ఎక్కువైపోయిందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.