: ఫెదరర్ కుటుంబంపై బాగా పాప్యులర్ అయిన వాట్సాప్ మెస్సేజ్ ఇది!


టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ గురించి తెలియని క్రీడాభిమానులుండరు. టెన్నిస్ లో ఎన్నో విజయాలు, రికార్డులు సాధించిన ముప్ఫై నాలుగేళ్ల ఫెదరర్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా ప్రత్యేకమే. ఎందుకంటే... ఫెదరర్ భార్య మిర్కా కూడా ఒకప్పటి టెన్నిస్ ప్లేయరే. వారి వైవాహిక జీవితంలో మొదటిసారి ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. ఏడాది క్రితం మళ్లీ కవలలే జన్మించారు. ఈసారి మగ కవలలు పుట్టారు. ఈ నేపథ్యంలో ఫెదరర్ కుటుంబం గురించి నెటిజన్లు సరదాగా కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లలో బాగా ప్రజాదరణ పొందిన వాట్సాప్ మెసేజ్ ఏమిటంటే... మెన్స్ సింగిల్స్, వుమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, వుమెన్స్ డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్.. ఇలా టెన్నిస్ లో అన్ని విభాగాల్లోనూ ఫెదరర్ ఫ్యామిలీ ఆడగలదని ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. కాగా, మిర్కాతో 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో మొదలైన పరిచయం పెళ్లి దాకా వెళ్లడం, 2009లో వాళ్లిదరూ వివాహం చేసుకోవడం జరిగింది. గాయం కారణంగా 2002లోనే టెన్నిస్ కు మిర్కా గుడ్ బై చెప్పింది. ఫెదరర్, మిర్కాల సంతానమైన కవల ఆడపిల్లల పేర్లు మిలా రోజ్, చార్లెనె రివా. కవల మగపిల్లల పేర్ల విషయానికొస్తే, లియో, లెన్నర్ట్.

  • Loading...

More Telugu News