: మతం పేరుతో మోదీ, కులం పేరుతో కేసీఆర్ చిచ్చు పెడుతున్నారు: పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీపైన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ, కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు. మతం పేరుతో మోదీ, కులం పేరుతో కేసీఆర్ రాకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఇరువురు నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. సమాజంలో ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని హితవుపలికారు.