: గేల్ రహస్యాన్ని బౌలర్లకు చెప్పి అవుట్ చేయించిన వార్నర్!


ఆదివారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా, రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య ఆద్యంతం ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బెంగళూరు జట్టు బరిలోకి దిగిన వేళ, సన్ రైజర్స్ కు గేల్, కోహ్లీలు చుక్కలు చూపారు. మ్యాచ్ ని లాగేసుకున్నంత పని చేశారు. గేల్ విజృంభించి ఆడుతున్న వేళ, సునాయాసంగా బెంగళూరు లక్ష్యాన్ని చేరుకుంటుందని కూడా అనిపించింది. అయితే, ఆ సమయంలో ఏ మాత్రం టెన్షన్ పడకుండా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, తన బౌలర్లకు గేల్ బలహీనతలను చెప్పాడట. నెమ్మదిగా బౌలింగ్ చేస్తూ, శరీరానికి దూరంగా వైడ్ వెళ్లేలా గేల్ కు బౌలింగ్ చేస్తే, అతన్ని సులువుగా బోల్తా కొట్టించవచ్చని చెప్పాట్ట. తన నమ్మకాన్ని వమ్ముచేయని భువనేశ్వర్ బంతులను గేల్ ధాటిగా ఎదుర్కొన్నప్పటికీ, కట్టింగ్ బంతికి అవుట్ అయ్యాడని వార్నర్ గుర్తు చేసుకున్నాడు. భువనేశ్వర్ కు మంచి భవిష్యత్ ఉందని, బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ కూడా చక్కగా రాణించాడని వార్నర్ చెప్పాడు. సాధ్యమైనంత త్వరగా టాప్-3 బ్యాట్స్ మెన్లను పెవీలియన్ కు పంపాలన్నదే తమ వ్యూహమని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News