: యువతీ యువకుల టాప్-5 భయాలివి!
యువతీ యువకులు అతి ఎక్కువగా భయపడే సందర్భాలేవి? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు మాంచెస్టర్ కు చెందిన క్రౌన్ క్లీన్ అనే సంస్థ 1000 మందితో సర్వే చేయించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. యువతులైతే, తాము 30వ ఏట అడుగుపెట్టే సమయంలో శరీర సౌందర్యంలో కలిగే మార్పులను చూసి ఆందోళన చెందుతారట. పురుషుల్లో 36వ ఏట ఇదే తరహా ఆందోళన మొదలవుతుందట. ఈ సర్వే వివరాల ప్రకారం మూడు పదుల వయసుకు దగ్గరయ్యే యువతుల్లో అతిపెద్ద భయం జుట్టు నెరుస్తుండటమేనట. ఆపై చర్మానికి ముడతలు రావడం, కళ్ల వద్ద క్యారీబ్యాగ్స్, డబుల్ చిన్, చేతులు లావుగా మారుతుండటం వంటి విషయాలకు అధికంగా ఆందోళన చెందుతున్నారట. ఇక పురుషుల విషయానికి వస్తే, మహిళలకు మల్లే ఛాతీ పెరగడం అతిపెద్ద భయమట. ఆ తరువాత జుట్టు రాలిపోతుండటం, డబుల్ చిన్, కొవ్వు కారణంగా పొట్ట పెరుగుతుండటం, జుట్టు నెరవడం టాప్-5 భయాల్లో ఉన్నాయి.