: కర్ణాటకలో గ్యాంగ్ వార్.. నడిరోడ్డుపై యువకుడ్ని కత్తులతో పొడిచి చంపిన వైనం
కర్ణాటకలోని అరసికెరేలో రెండు గ్రూపుల మధ్య గొడవ చెలరేగింది. చిన్న విషయంపై తలెత్తిన గొడవ కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది. అరసికెరేలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రెండు గ్రూపులు రెచ్చిపోయాయి. యువకులు ఒకరిపై ఒరకు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రక్తం వచ్చేటట్లు కొట్టుకున్నారు. గొడవలో వరుణ్ అనే యువకుడిని కత్తులతో పొడిచి చంపేశారు. పలు దుకాణాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. దీంతో స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటోన్న పలువురిని అరెస్టు చేశారు. మరికొందరు పరారయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.