: ఇన్‌స్ట్రాగ్రాంలో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన ప్రియాంక చోప్రా.. ఎంత సీరియస్‌గా ఉందో!
క్వాంటికో సీరియల్, బేవాచ్ మూవీ షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన నటి ప్రియాంక చోప్రా మూడురోజుల క్రితం విదేశాల నుంచి ముంబయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ముంబయికి చేరుకున్న తరువాత తన ఇన్‌స్ట్రాగ్రాం ఖాతాలో మొదటిసారి ఓ ఫోటోను పోస్ట్ చేసింది ఈ అమ్మడు. చిన్నప్పుడు తన నానమ్మతో దిగిన ఫోటోను బేవాచ్ సుందరి తాజాగా పోస్ట్ చేసింది. తన నానమ్మ 94వ పుట్టిన రోజు వేడుక సందర్భంగా తాను తన నాన్నమ్మ, నాన్న అశోక్ చోప్రాలతో కలిసి దిగిన ఫోటోని ప్రియాంక చోప్రా అభిమానులతో పంచుకుంది. తన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. చిన్నప్పుడు తన నానమ్మ, నాన్న పక్కన కూర్చొని ఎంతో సీరియస్‌గా ప్రియాంక చోప్రా చూస్తోన్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది.