: నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కు 'నారీ జాగరణ్ సమ్మాన్' అవార్డు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కు 2016 సంవత్సరానికిగాను నారీ జాగరణ్ సమ్మాన్ అవార్డు లభించింది. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పెద్దన్న సోమాభాయ్ దామోదర్ దాస్ మోదీ, తన తల్లి తరఫున అవార్డును స్వీకరించారు. నారీ జాగరణ్ పత్రిక ఎడిటర్ మీనా చూబే ఈ అవార్డును సోమాభాయ్ కి అందించగా, ఆపై ఆయన మాట్లాడుతూ, 96 సంవత్సరాల తన తల్లి అవార్డు కార్యక్రమం కోసం రాలేకపోయారని వివరించారు. మహిళల రక్షణకు పాటుపడుతున్న వారికి, దేశంలోని తల్లులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు తెలిపారు. తాను 2014లో ఇక్కడికి వచ్చానని, అప్పటికీ, ఇప్పటికీ నగరం ఎంతో మారిపోయిందని సోమాభాయ్ వ్యాఖ్యానించారు.