: అర్చకుడిపై కాల్ మనీ వ్యాపారుల ప్రతాపం!... భగ్గుమంటున్న బ్రాహ్మణ సంఘాలు
కృష్ణా జిల్లాలో మరోమారు కాల్ మనీ దుర్మార్గులు స్వైర విహారం చేశారు. తమ వద్ద అప్పు తీసుకున్న ఓ అర్చకుడిపై భౌతిక దాడికి దిగారు. కాల్ మనీ వ్యాపారుల దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధిత అర్చకుడు ఆసుపత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. వివరాల్లోకెళితే... కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఫణికుమార్ శర్మ ఇటీవల తన అవసరం నిమిత్తం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నాడు. రుణం చెల్లించడంలో జాప్యం జరగడంతో కాల్ మనీ వ్యాపారులు అతడిపై దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడ్డ ఫణికుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న బ్రాహ్మణ సంఘాలు కాల్ మనీ దుర్మార్గంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.