: భారీ వర్షాలతో యూపీలో జనజీవనం అస్తవ్యస్తం.. 12మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో కురుస్తోన్న వర్షాలతో అక్కడి జన జీవనం అస్తవ్యస్తమయింది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలతో అక్కడి అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షం ధాటికి, పిడుగు పాటుతో 12మంది మృతి చెందారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ చెట్లు నేలకూలుతున్నాయి. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. పోటెత్తుతోన్న వరదలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.