: తమ ఓటమికి కారణాన్ని వివరించిన విరాట్ కోహ్లీ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ జట్టు ఓటమి పాలవడానికి బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణాన్ని చెప్పాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ ఎటాక్ చాలా బలంగా ఉందని అందుకే తాము ఓటమిపాలయ్యామని, తమ ప్రత్యర్థి జట్టు నెగ్గిందని విరాట్ అన్నాడు. ఏబీ డివీలియర్స్‌తో పాటు తాను ఇంకాసేపు క్రీజులో నిలదొక్కుకుంటే తమ జట్టు కప్పుకొట్టేసేదని అన్నాడు. ఫైనల్‌లో ఓడినా ఐపీఎల్-9 సీజన్‌లో మంచి ఆటతీరు కనబర్చినందుకు ఆనందంగా ఉందని ఆయన తెలిపాడు. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఆరెంజ్ క్యాప్ దక్కినప్పటికీ, ఓటమి పాలయిన జట్టులో ఉండి ఆ క్యాప్‌ను సొంతం చేసుకోవడం మాత్రం కాస్త నిరాశగానే ఉందని అన్నాడు.