: బెజవాడ శివారులో మంద కృష్ణ అరెస్ట్!... మీడియా సమావేశం కోసం వెళుతుండగా అడ్డగింత


ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణే అంతిమ లక్ష్యంగా కార్యరంగంలోకి దిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేత మంద కృష్ణ మాదిగకు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఈ దళిత ఉద్యమ నేతకు వరుస అరెస్టులు స్వాగతం పలుకుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో జరగనున్న విలేకరుల సమావేశానికి వెళుతుండగా, నగర శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద మాటేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేవలం విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకే వెళుతున్నానని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు. దీంతో పోలీసులపై మంద కృష్ణ మండిపడ్డారు. అయినా వెనక్కు తగ్గని పోలీసులు ఆయనను తమ వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News