: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపడంలో భారతీయులే నెంబర్ వన్!


ప్రపంచం మొత్తం మీద వ్యక్తిగతంగానైనా, సామాజిక మాధ్యమాల ద్వారానైనా ఏదైనా విషయాన్ని ఆత్మ విశ్వాసంతో చెప్పడంలో ఇండియన్స్ టాప్ లో ఉన్నారని లింకెడిన్ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. 'యువర్ స్టోరీ @ వర్క్' పేరిట సర్వేను నిర్వహిస్తూ, ఈ నెల రెండు, మూడవ వారాల్లో పలు దేశాల్లోని యువ ప్రొఫెషనల్స్ ను ప్రశ్నించగా, ఈ విషయం వెల్లడైంది. ఇతరదేశాల యువతతో పోలిస్తే, ఇండియన్స్ మరింత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపుతున్నారని సర్వే పేర్కొంది. అమెరికా, కెనడాలతో పాటు ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఇండియా, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఐర్లాండ్, ఇండొనేషియా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ తదితర దేశాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్న 11 వేల మందికి పైగా యువకులను తాము ప్రశ్నించినట్టు లింకెడిన్ వెల్లడించింది. పలు దేశాల్లోని యువతలో 35 శాతం మాత్రమే ఆత్మ విశ్వాసంతో ఉండగా, భారతీయుల్లో 55 శాతం మంది మంచి ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించారని పేర్కొంది. అందువల్లే వరల్డ్ ఎంప్లాయిమెంట్ మార్కెట్లో భారతీయులు రాణిస్తున్నారని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News