: సానియా, హింగిస్ జోడీకి పెద్ద షాక్... ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్ లోనే ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీకి మూడో రౌండులోనే షాక్ తగిలింది. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్లుగా, నెంబర్ వన్ ర్యాంకులో బరిలోకి దిగిన వీరు, చెక్ రిపబ్లిక్ కు చెందిన బార్బోరా క్రెజ్ సికోవా, కేథరినా సినియాకోవా జోడీ చేతిలో 3-6, 2-6 చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అంతకుముందు ఇండో - రొమేనియన్ జోడీ రోహన్ బొప్పన, ఫ్లోరిన్ మెర్గియాల జోడీ 6-2, 6-7 (4), 6-1 తేడాతో మార్కస్ డానియేల్, బ్రియాన్ బాకర్ జోడీని ఓడించగా, 16వ సీడ్ గా బరిలోకి దిగిన పేస్, మార్సిన్ మత్కోస్కీ జంట, 4వ సీడ్ బ్రూనో సోరిస్, జెమ్మీ ముర్రేలను 7-6 (5), 7-6 (4) తేడాతో ఓడించింది. మిక్సెడ్ డబుల్స్ విభాగంలో బొప్పన, రష్యాకు చెందిన అలా కుద్రియావెసెవాల జోడీ బ్రిటన్, చైనీస్ తైపే జోడీ జిమ్మీ ముర్రే, చింగ్ చాన్ చేతిలో 6-2, 3-6, 8-10 తేడాతో ఓటమి పాలయ్యారు.