: బాలీవుడ్ నటుడు సురేశ్ చత్వాల్ కన్నుమూత
హిందీ సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించి ఎంతోమంది అభిమానుల ఆదరణ పొందిన సురేశ్ చత్వాల్ ఇకలేరు. అనారోగ్యంతో సురేశ్ చత్వాల్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు యమన్ చత్వాల్ తెలిపారు. తన తండ్రి శనివారం తుదిశ్వాస విడిచారని, నిన్న ఆయన అంత్యక్రియలు నిర్వహించామని చత్వాల్ పేర్కొన్నారు. ‘మా తండ్రి ఇక మా మధ్య ఉండరనే విషయం మాకెంతగానో బాధ కలిగిస్తోంద’ని యమన్ చత్వాల్ మీడియాతో అన్నారు. 1969లో హిందీ చిత్ర సీమకు పరిచయమయిన సురేశ్ చత్వాల్ మొదటి సినిమా 'రాఖీ రాఖీ'. ఆయన చివరి చిత్రం నక్షత్ర(2010). 'ఎఫ్‌ఐఆర్' అనే టీవీ సీరియల్‌లోనూ నటించి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.