: జగన్ నాకు మేనల్లుడండి... వాడు లేకుండా ఎలా ఉంటాను?: కేవీపీ


"కేవీపీతో ఇంటర్వ్యూ అంటే జగన్ మోహన్ రెడ్డి గురించి, వైఎస్ రాజశేఖరరెడ్డి గురించిన అంశాలుంటాయని ప్రేక్షకులు అనుకుంటారు. అవి మాట్లాడకుంటే ఎలా?" అంటూ టీవీ 9 ప్రెజంటర్ మురళీకృష్ణ అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేత కేవీపీ తనదైన శైలిలో స్పందించారు. "జగన్ మోహన్ రెడ్డి అనే వాడు నా మేనల్లుడండీ. వాడు లేకుండా ఎలా ఉంటానండీ? మనం ఆ విషయాలు మాట్లాడుకోవద్దు. అవి కుటుంబ విషయాలు. మా పార్టీ విషయాలు మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు రాష్ట్రం విషయాలు మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా, సమస్యలపై మాట్లాడేందుకే వచ్చాను" అని కేవీపీ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News