: గంటలకొద్దీ ప్రసంగంలో ఒక్కసారి కూడా కేసీఆర్ ఊసెత్తని చంద్రబాబు


అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై విరుచుకుపడే చంద్రబాబు ఈ దఫా ఎంతో తగ్గారు. ఎంతగానంటే, మూడు రోజుల మహానాడు వేడుకల్లో, ఆయన గంటల కొద్దీ ప్రసంగించి కూడా కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదు. మొన్నటి వరకూ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని, అవినీతి చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, తాజాగా, ఆ విషయాలనేవీ ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రాంతం ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం, పార్టీ బలోపేతానికి సహకరిస్తానని మాత్రం చెప్పి వదిలేశారు. కేసీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడకపోవడం, అక్రమ నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటామన్న మాట తప్ప మరేమీ వ్యాఖ్యానించకపోవడంపై మహానాడులో కార్యకర్తల మధ్య పెద్ద చర్చే జరిగింది. యువనేత నారా లోకేష్ సైతం తండ్రి చంద్రబాబు దారిలోనే నడిచినట్టు కనిపించారు. తెరాస, వైకాపాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారే తప్ప, ప్రత్యేకించి కేసీఆర్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News